చాలా కాలం తర్వాత తెలుగు తెరపై ఓ అచ్చమైన తెలుగు సినిమా వెల్లువరిసింది. హద్దులు దాటిన ప్రేమ పిచ్చి, అసభ్యమైన సన్నివేశాలు, భయం పుట్టించే హింసాత్మక సన్నివేశాలు, ద్వందార్థాలతో వచ్చే చండాలమైన డైలాగులు, బూతు సన్నివేశాలు తప్ప ఈతరం తెలుగు సినిమాల్లో ఇంతకు మించి ఇక ఏమీ ఉండదని, కుటుంబ సమేతంగా చూసే స్వచ్చమైన సినిమాలు ఇక రావేమో అని సగటు కుటుంబ ప్రేక్షకుడు ఆందోళన చెందుతున్న తరుణంలో….ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, బంధాలు, బాంధవ్యాలు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన అందమైన కథాంశం ఫ్యామిలీ ప్రేక్షక రంజక సినిమా మన ముందుకు వచ్చింది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.
సినిమాలో కమర్షియల్ అంశాలకు పెద్ద పీఠవేయక పోయినా…..కుటుంబ సమేతంగా ఆనందించ దగ్గ సినిమా ఇది. అలా అని యూత్ కు నచ్చని అంశాలు లేనవి కాదు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వాటికి కూడా తగిన స్థానం కల్పించారు. కాక పోతే రొటీన్ మహేష్ బాబు సినిమాలా ఉండాలని భారీ అంచనాలతో వెళితే మాత్రం కాస్త నిరాశ తప్పదు. అచ్చమైన తెలుగు కుటుంబ వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళితే మీరు పూర్తి సంతృప్తి చెందుతారు.
అచ్చమైన తెలుగు సినిమా..! సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసే ప్రేక్షకులు తమ రియల్ లైఫ్ లో తమ చుట్టు జరిగే సన్నివేశాలను చూసిన అనుభూతిని పొందుతారు దాదాపు 25 సంవత్సరాల తర్వాత తెలుగు తెరపై వెల్లు విరిసిన భారీ మల్టీ స్టారర్ కుటుంబ కథ చిత్రం అయిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఈ సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. టాక్ కాస్త యావరేజ్ గా ఉన్నప్పటికీ కుటుంబ ప్రేక్షకులు స్లోగా మూవ్ అవతారు కాబట్టి పుంజుకునే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment